ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.

సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీద చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు.

2019లో ఒక అభిప్రాయవేదికని నిర్వహించిన అమెరికన్ పాత్రికేయుడు బ్రెట్ స్టీవెన్, విలా కేథర్‌ని డానల్డ్ ట్రంప్‌కు ఆంటీడోట్‌గా పేర్కొన్నాడు. అమెరికాను గొప్ప దేశంగా చేసే లక్షణాలేమిటో విలా నవలలు చెబుతాయని విమర్శకులు ప్రశంసించారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు విలా కేథర్‌ని చదవాలను గుర్తుచేశాయని అన్నా తప్పులేదు.

కీర్తనల్ని వాగ్గేయకారులు పాడుతూనే రచిస్తున్నారు. త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసూ తమ కీర్తనల్ని పాడేశారు గాని, సాహిత్యం ముందు కట్టుకుని స్వరములు వేరే కట్టుకోలేదు. అంటే, కీర్తనలోని రాగం అసలుతో చేరే బయటపడుతోందని నా అభిప్రాయం. కీర్తనలోని రాగం పుట్టుకతోనే ఉంది. అల్లాగే పద్యాలతో చేరి రాగాలు రావడము లేదు. వివరంగా మనవి చేస్తున్నా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రాగంలో పద్యాల్ని పాడుకున్నట్లు చెప్పేను.

ఇవ్వాల్టి కోసమే నిన్నటి కాటుక కారిన కంటితో
వేల మైళ్ళ కాలి మాల కట్టుకుని, రాళ్ళు వదిలే ఊపిరిగా…
రెక్కల కొమ్మల భుజాలని ఇచ్చాను.
గుమ్మడి పూల ఒళ్ళు అలవాటులో పడి చుక్కల ఆకాశం తెప్పల రాగం పాతగా పాడింది.
చెక్కిన ఏనుగు దంతపు మొనతో అధికార వసంతపు ఆట.

ఈ ముసలోడెందుకు ఇంతలా శివా! శివా! అని కేకేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడో అని కూడా అనిపించసాగింది. సమయం దొరికినప్పుడల్లా చిలకస్వాముల పక్కన చేరి ఆయన్ని ఆటపట్టించడంలో ఆనందం పొందాడు. రోజులు గడిచిన కొద్దీ చిలకస్వాములతో ఒక మాటయినా మాట్లాడించాలని పంతం పట్టాడు అర్చకస్వామి. అయితే అది అంత సులువయిన పనిగా అనిపించలేదు. చాలావరకు చిలకస్వామి ఏ రకంగానూ ప్రతిఘటించేవాడు కాడు.

మా తాతవాళ్ళు పసిఫిక్ సముద్రంలో ఉన్న ఛానల్ ఐలాండ్స్‌లో ఉండేవాళ్ళట. అక్కడకి సీ లయన్స్ వచ్చేవట, అవి మేటింగ్ సీజన్లో సముద్రపు ఇసుకలోకి చేరేవి. ఒకసారి ఒక సీ లయన్ పుట్టాక దాని తల్లి చనిపోయిందట, తండ్రి సముద్రంలోకి వెళ్ళి తిరిగి రాలేదట. ఆ సీ లయన్‌కి రాస్ అని పేరుపెట్టి మా తాత పెంచుకున్నాడు. మా అమ్మ, రాస్‌తో దగ్గరగా పెరిగిందట. రాస్‌కి మా అమ్మ అంటే అలవికాని ప్రేమ.

ఈసారి ఆయన నాకేసి మరింత కోపంగా చూశాడు. ఊ… అంటూ ఓసారి దీర్ఘం తీసి, ‘ఇంకెక్కడి నందు వాళ్ళమ్మ? నేనెప్పుడో దాన్ని పీక పిసికి చంపేశానుగా’ అన్నాడు. ఆ మాటతో నా గుండెలవిసిపోయాయి. కాళ్ళ క్రింద భూమి కదలిపోయింది. ఆ పరాయి ఊరిలో… ఆ చీకట్లో…

పుణికి పువ్వులు పుచ్చుకున్నట్టు
కిందపడ్డ పొగడపువ్వులు
ఏరుకున్నట్టు

జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి
దారితీసే మాటలు
పెదాలమీదకి తుళ్ళుకుంటూ వచ్చే
బాల్యం లాంటి మాటలు

‘నాన్నగారూ, మిమ్మల్ని కదలొద్దని చెప్పాను. ఒక చోట కూర్చోండి నేను చెప్పేవరకు’ ఇందాకటి గొంతే. పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. సాయం చేద్దామని ఉన్నా వాళ్ళకి చేసే ఓపికుండదు. కాళ్ళకి చేతులకి అడ్డంగా అనిపిస్తారు. ప్చ్! సాయంకాలం మా ఇంటికి పిలిచి కూర్చోపెట్టుకోవాలనుకున్నాను. ఇంతలో పెద్దగా ‘నాన్నగారూ!’ అన్న కేక వినిపించింది. పెద్దాయన్ని మరీ అంత ఘట్టిగా కోప్పడుతోంది. ఎంత తండ్రి అయినా పాపం కదూ! కూతురు కేకలకి బిక్కచచ్చిపోయుంటాడు.

మూడు మైళ్ళు పరుగెట్టాక కట్టెలకు వెళ్ళిన ఇద్దరూ ఎదురుగా వస్తూ కనిపించేరు. వాళ్ళు నిజంగానే చుట్టలు తాగుతూ కాలక్షేపం చేశారు. కట్టెలు ఇంకో గంటలో వస్తాయని వీరితో బొంకారు. ఈ ఇద్దర్నీ చూశాక పరుగెట్టే ఇద్దరూ ఆగి చెప్పారు శవం కదలడం, మూలుగు వినడం అవీ. ఇది విన్న వాళ్ళు వీళ్ళని వెక్కిరించారు పిరికిపందలని. మొత్తానికి నలుగురూ కలిసి మరోసారి శ్మశానానికి తిరిగొచ్చారు. గుడిసెలోకి వెళ్ళాక తెల్సింది – కాదంబిని శవం అక్కడ లేదు.

సమాధి దగ్గర్లో గుప్పెడు మట్టిని తీసి
జేబులో వేసుకున్నాను
నడుస్తుంటే చెమటతో తడిచిన మట్టిలో
ఏదో కదలాడినట్టై చూస్తే
లోపల కళ్ళు పేలని విత్తనం
కవి అబద్ధం కానందుకు ఆనందమేసింది

నేను నిశ్చయత కోరుకున్నది గణితంలో మాత్రమే కాదు. రెనె డెకార్ట్ లాగా నాక్కూడా బయటి ప్రపంచమంతా ఒక కల కావచ్చునని అనిపించేది. ఒకవేళ అది నిజంగా కలే అయినా, ఆ కలను కనడం నిజం కాబట్టి, ఆ కలను నేను అనుభూతి చెందుతున్నది నిస్సందేహమైన వాస్తవం కాబట్టి నా ఉనికి అనుమానించలేనిదని నాకు అనిపించింది.

ఏప్రిల్ 2024 ఈమాట లోని మూడు రచనలపై నా స్పందన ఇది. నా ఈ విమర్శ అవసరమా అని ఎవరయినా ప్రశ్నిస్తే దానికి తిరుగు ప్రశ్న, ఆ వ్యాసాలు ప్రచురించడం ఎందుకు అవసరం? అని. సంపాదకీయంలో ప్రస్తావించబడ్డాయి గనుక – అని జవాబు. ఆ సంపాదకీయానికి అవసరం? ఒక గాయకుడికి ప్రకటించిన పురస్కారం లేపిన దుమారం. కారణం, త్యాగయ్య మీద ఆ గాయకుడి వ్యాఖ్యలని కొందరు అనుచితాలనడం.

తెలుగు క్రియాంత భాష కాబట్టి, సాధారణంగా తెలుగు భాషా లక్షణాలను వివరించేందుకు రాసిన సంప్రదాయ వ్యాకరణంలోనైనా, ఆధునిక వ్యాకరణంలోనైనా క్రియకు ప్రాధాన్యం ఉండటం సహజం. అందువల్ల ఈ విషయాన్ని వెల్చేరుగారు మొదటగా కానీ, ప్రత్యేకంగా కానీ ‘కనిపెట్టా’రన్నట్టు చెప్పడం సబబు కాదు.

మెహక్ ఈ సంపుటి ముందుమాటలో చెప్పినట్టు రెండు ముఖ్య విషయాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకటి – ఇతివృత్తాలు, సంవిధానం, ముగింపు భిన్నంగానే కనిపిస్తాయి. రెండు – ఇరు మతాల మధ్య సయోధ్య పెంపొందించి, వైరుధ్యాలను వెదికి వేరుచేసి, చెరిపేసే కృషి వున్న సృజనశీలత. ఈ రెండు విశేషాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి ఈ కథల్లో.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

తెలుగుదారి పుస్తకం వీటన్నిటికంటే భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఈ వ్యాకరణాన్ని సమగ్రమైన తెలుగు వ్యాకరణం అనడానికి వీల్లేదు. వ్యాకరణ పరిభాష అంతా ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు అధ్యాపకులకు కాని, విద్యార్థులకు కాని ఇది అంతగా ఉపయోగపడదు.